నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్హౌస్ వేడుకలు | Obama celebrates Diwali, lights first-ever diya in Oval Office | Sakshi
Sakshi News home page

నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్హౌస్ వేడుకలు

Oct 31 2016 11:54 AM | Updated on Sep 4 2017 6:48 PM

నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్హౌస్ వేడుకలు

నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్హౌస్ వేడుకలు

వైట్హోస్ దివాళి వేడుకలతో వెలుగొందుతోంది.

వాషింగ్టన్ : వైట్హోస్ దివాళి వేడుకలతో వెలుగొందుతోంది. ఓవల్ ఆఫీసులో మొదటి దీపాన్ని వెలిగించి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలను ప్రారంభించారు.  ఈ సంప్రదాయాన్ని తన తర్వాతి వారు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు ఒబామా పేర్కొన్నారు. కాగ, వైట్హోస్లో దీపావళి వేడుకలను ప్రారంభించిన తొలి అధ్యక్షుడు బరాక్ ఒబానానే. 2009లో ఆయన ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొంతమంది ఇండియన్-అమెరికన్లు తన అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారని, వారందరి కోసం ఈ వేడుకలను జరుపుతున్నట్టు ఒబామా చెప్పారు. దివాళి సెలబ్రేషన్స్ను ప్రారంభించిన తొలి అధ్యక్షుడిని తానే కావడం, చాలా గర్వంగా ఫీలవుతున్నానని ఒబామా చెప్పారు. 
 
దివాళి రోజు ముంబాయిలో తమల్ని భారతీయులు ఆహ్వానించిన తీరును, తమతో వారుచేసిన డ్యాన్స్లను మిచెల్, తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. చీకటిని వెలుగు ఎలా అధిగమిస్తుందో తెలిపే సంకేతంగా ఈ దీపం నిలుస్తుందన్నారు. తర్వాత వైట్హోస్కు వచ్చే అధ్యక్షులు కూడా ఈ వేడుకలను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు వైట్హోస్ ఫేస్బుక్ పేజ్లో తెలిపారు. ఈ మెసేజ్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.  అర్థరాత్రి ఒబామా చేసిన ఈ పోస్టుకు 1.5 లక్షలమంది లైక్ రాగా.. 33వేలకు పైగా సార్లు షేర్ చేశారు. ఈ దివాళి వేడుకలు తమ ప్రియమైన వారందరికీ శాంతి సౌభాగ్యాలతో ఆనందం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దివాళి వేడుకలు జరుపుకుంటున్నారో వారందరికీ  శుభాకాంక్షలు చెప్పారు.    
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement