అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఆదివారం రూ. 53.50 మేర తగ్గించాయి. ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,134గా ఉన్న ఈ సిలిండర్ ధర తాజా తగ్గింపుతో రూ.1,080.50కు అందనుంది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఆదివారం రూ. 53.50 మేర తగ్గించాయి. ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,134గా ఉన్న ఈ సిలిండర్ ధర తాజా తగ్గింపుతో రూ.1,080.50కు అందనుంది.
సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది రెండోసారి. ఫిబ్రవరి 1న ఈ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 107 మేర తగ్గించాయి. మరోవైపు విమానాల ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను 1 శాతం (కిలోలీటర్‌కు రూ. 753.34) పెంచాయి. ముంబైలో ప్రస్తుతం కి.లీ.కు రూ. 76,524.33గా ఏటీఎఫ్ ధర పెంపుతో రూ. 77,322.60కు పెరిగింది.