ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ నేతలు | Nomula narasimhaiah slams congress leaders | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ నేతలు

Jul 20 2015 1:44 AM | Updated on Mar 18 2019 8:51 PM

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను గమనించే స్థితిలో కాంగ్రెస్ లేదని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించారు.

టీఆర్‌ఎస్ నేత నోముల విమర్శ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను గమనించే స్థితిలో కాంగ్రెస్ లేదని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించారు. కేసీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఆయన దిష్టిబొమ్మలు తగులపెట్టిన నీచమైన పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు డిండి ప్రాజెక్టుకు జరిగిన శంకుస్థాపన కూడా కనిపించడం లేదన్నారు.

మరో వైపు టీడీపీ నేతలు చివరకు వరద నీళ్లపైనా తగాదాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు నీచ స్థాయికి దిగజారి శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి కేసీఆర్ నియంతాలనే వ్యవహరిస్తారన్నారు. వికీ లీక్స్ చంద్రబాబు కుట్రలను బయట పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని నోముల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement