'అధికారులను సొంత పనులకు వాడుకోలేదు' | No misuse of government machinery at my son's wedding: Manohar Parrikar | Sakshi
Sakshi News home page

'అధికారులను సొంత పనులకు వాడుకోలేదు'

Jan 2 2014 1:49 PM | Updated on Sep 2 2017 2:13 AM

'అధికారులను సొంత పనులకు వాడుకోలేదు'

'అధికారులను సొంత పనులకు వాడుకోలేదు'

సొంత పనులకు ప్రభుత్వ అధికారులను వాడుకున్నారని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు.

పనాజీ: సొంత పనులకు ప్రభుత్వ అధికారులను వాడుకున్నారని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. గత నెలలో జరిగిన తన కుమారుడి వివాహానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తానెప్పుడూ అధికారులను వ్యక్తిగత పనులకు వినియోగించుకోలేదన్నారు. పెళ్లి శుభలేఖలను కూడా తన సొంతకారులో వెళ్లి పంచిపెట్టినట్టు వెల్లడించారు.

విపక్ష నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు. వారు చేసిన ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. అధికారులు ప్రభుత్వ వాహనాల్లో పెళ్లి హాజరైనంత మాత్రానా దాన్ని అధికార దుర్వినియోగం అనడం సమంజసం కాదన్నారు. పెళ్లికి హాజరైన రాజ్నాథ్, నరేంద్ర మోడీ భద్రత కోసం ప్రోటోకాల్ ప్రకారం అధికార యంత్రంగాన్ని మొహరించామని వివరించారు. పారికర్ కుమారుడు అభిజాత్ వివాహం డిసెంబర్ 26న జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement