ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్‌ | Manohar Parrikar Responding Well To Treatment | Sakshi
Sakshi News home page

పారికర్‌ కోలుకుంటున్నారు: సురేష్‌ ప్రభు

Mar 24 2018 7:59 PM | Updated on Mar 24 2018 7:59 PM

Manohar Parrikar Responding Well To Treatment - Sakshi

పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్‌ పారికర్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు  ట్విట్‌ చేశారు.  ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్‌  అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్‌ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్‌ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్‌ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’  అని తన ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ప్యాంక్రియాటిక్‌ సమస్యతో పారికర్‌ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్‌  సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య  తీవ్రం కావడంతో పారికర్‌ పనాజీలోని  గోవా మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను  అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement