'పథకం ప్రకారమే నితీష్ను చంపారు' | Nitish Katara murder case: SC upholds conviction | Sakshi
Sakshi News home page

'పథకం ప్రకారమే నితీష్ను చంపారు'

Aug 17 2015 5:34 PM | Updated on Sep 2 2018 5:24 PM

'పథకం ప్రకారమే నితీష్ను చంపారు' - Sakshi

'పథకం ప్రకారమే నితీష్ను చంపారు'

నితీష్ కఠారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్లను దోషులుగా ప్రకటించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

న్యూఢిల్లీ: నితీష్ కఠారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్లను దోషులుగా ప్రకటించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. యాదవ్ సోదరులు ఓ పథకం ప్రకారం కఠారాను హత్య చేశారని పేర్కొంది. కాగా ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించే విషయం పరిశీలిస్తామని వెల్లడించింది.

వికాస్, విశాల్ల సోదరి భారతీ యాదవ్ను నితీష్ ప్రేమించాడు. 2002లో నితీష్, భారతి ఢిల్లీ శివారులో ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆ సమయంలో యాదవ్ సోదరులు నితీష్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. వీరికి సుఖ్దేవ్ పెహల్వాన్ సహకరించాడు. యాదవ్ సోదరులు మాజీ ఎంపీ డీపీ యాదవ్ కుమారులు కాగా, నితీష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడు. ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు యాదవ్ సోదరులతో పాటు సుఖ్దేవ్కు జీవిత శిక్ష విధించింది. వీరికి మరణశిక్ష విధించాలని నితీష్ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నితీష్ తల్లి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. నిందితులకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టులోనూ వీరిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడింది. కాగా వీరి శిక్ష తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement