ఎన్ఐఐటీకి బ్రెగ్జిట్ దెబ్బ | NIIT Technologies Falls Nearly 5% As Q2 Profit Declines | Sakshi
Sakshi News home page

ఎన్ఐఐటీకి బ్రెగ్జిట్ దెబ్బ

Oct 17 2016 4:46 PM | Updated on Jul 11 2019 8:56 PM

ఎన్ఐఐటి టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత నికర లాభంలో 9 శాతం క్షీణతను నమోదు చేసింది.

ముంబై:  ఎన్ఐఐటి టెక్నాలజీస్  ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది.   ఏకీకృత నికర లాభంలో 9 శాతం క్షీణతను నమోదు  చేసింది.   క్యూ2లో(జూలై-సెప్టెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  రూ. 60 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది  ఇదే త్రైమాసికంలో 64.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.  
 అయితే ఏకీకృత ఆదాయం రూ 2 శాతం వృద్ధితో 692.9 కోట్లను  సాధించింది.  2015 జూలై-సెప్టెంబర్  త్రైమాసికంలో రూ. 679 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (బీఎఫ్ఎస్ఐ) 3.4 శాతంగా ఉన్నాయి  సోమవారం సంస్థ ఫలితాల  ప్రకటన తర్వాత   ఇన్వెస్టర్లు  సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాలు జోష్ అందుకుంది.  దాదాపు  6.3 శాతం పతనమై చివరికి 4.8 శాతం నష్టాలకు పరిమితమైంది.  
 కాగా బ్రెగ్జిట్  అనిశ్చిత పరిణామాలు,  ఎన్ఐటీఎల్ (బ్రిటన్ లో బీమా సేవలు అందించే) ఆదాయాల్లో క్షీణత  తమ లాభాలను ప్రభావితం చేశాయని  ఎన్ ఐఐటీ సీఈవో అరవింద్ ఠాకూర్ చెప్పారు. కంపెనీ డిజిటల్ వ్యాపారం బలంగా ఉందనీ, దీంతో మొత్తం రాబడిలో 19 శాతం   సాధించిందని చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement