లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు | Nifty opens Sept series above 8600, Sensex firm; Tata Motors up | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Aug 26 2016 10:05 AM | Updated on Sep 4 2017 11:01 AM

సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభం కావడంతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి.

ముంబై : సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభం కావడంతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 58.15 పాయింట్ల లాభంలో 27896.73గా, నిఫ్టీ 15.18 పాయింట్ల లాభంలో 8608గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు రాత్రి ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ యెలెన్ చేయనున్న కీలక ప్రసంగంపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లలో రేట్లు పెంచవచ్చన్న సంకేతాల్ని ఈ సందర్భంగా యెలెన్ ఇస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయి. అటు ఆసియా మార్కెట్లు సైతం యెల్లన్ ప్రసంగ నేపథ్యంలో మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.

టాటా మోటార్స్ నేడు క్యూ1 ఫలితాను వెల్లడించనున్న క్రమంలో ఆ కంపెనీ షేర్లు 2 శాతం మేర లాభాల బాట పట్టాయి. అమెరికా రెగ్యులేటరీ నుంచి పారోక్సిటైన్ టాబ్లెట్ల ఎక్కువగా విడుదలకు లుపిన్కు అనుమతి లభించడంతో, ఆ కంపెనీ ఒక శాతం మేర లాభపడుతోంది.  టాటామోటార్స్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, మార్కెట్లో లాభాలకు దోహదం చేస్తున్నాయి. కోల్ ఇండియా, ఎస్బీఐ, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీలు సెన్సెక్స్లో లూజర్లుగా నిలుస్తున్నాయి.
అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.04 పైసలు బలపడి 67.01గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 118 రూపాయలు పడిపోయి 30,928గా నమోదవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement