క్యాచ్ పట్టాడు.. క్యాష్ కొట్టాడు! | New Zealand fan takes $83,000 catch | Sakshi
Sakshi News home page

క్యాచ్ పట్టాడు.. క్యాష్ కొట్టాడు!

Jan 8 2014 1:56 PM | Updated on Sep 2 2017 2:24 AM

న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని ఒకరిని అదృష్టం వరించింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్నందుకు 83 వేల అమెరికా డాలర్లు(సుమారు 51 కోట్ల రూపాయలు) అతడు గెల్చుకున్నాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని ఒకరిని అదృష్టం వరించింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్నందుకు 83 వేల అమెరికా డాలర్లు(సుమారు 51 లక్షల రూపాయలు) అతడు గెల్చుకున్నాడు. న్యూజిలాండ్, వెస్టిండీస్ వన్డే మ్యాచ్ సందర్భంగా అతడీ మొత్తం సాధించాడు.

బౌండరీ లైన్ దాటిన బంతిని ఒడిసిపట్టిన మైఖేల్ మోర్టాన్ ఈ బహుమతి అందుకున్నాడు. వెస్టిండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ కొట్టిన సిక్స్ను క్యాచ్ పట్టి క్యాష్ సొంతం చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో నగదు గెల్చుకోవడం నమ్మలేకపోతున్నానని స్కై న్యూస్తో మైఖేల్ మోర్టాన్ అన్నాడు. తన తండ్రి పక్కన కూర్చుని మ్యాచ్ చూస్తుండగా వచ్చిన బంతిని పైకెగిరి పట్టుకున్నానని తెలిపాడు.

ఆరంజ్ రంగు టీ-షర్ట్ ధరించి ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్న వారికి బహుమతి ఇస్తామని నిర్వాహక సంస్థ బ్రివర్ తుయ్ ప్రకటించింది. స్పాన్సర్షిప్ ప్రమోషన్లో భాగంగా ఈ పోటీ పెట్టింది. అయితే గెలిచిన వారికి ఎంత మొత్తం ఇస్తామనేది ముందుగా వెల్లడించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement