ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జి | Nelson Mandela discharged from hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జి

Sep 2 2013 3:49 AM | Updated on Sep 1 2017 10:21 PM

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95)ను ఆదివారం ప్రిటోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95)ను ఆదివారం ప్రిటోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తీవ్రమైన ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనకు మూడు నెలలుగా ఆస్పత్రిలో వైద్యం అందిస్తూ వచ్చారు. ఇకపై జొహాన్నెస్‌బర్గ్‌లోని ఆయన ఇంట్లోనే ఐసీయూ తరహా చికిత్స అందించనున్నారు. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని జుమా ప్రతినిధి మెక్ మహారాజ్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement