కాశ్మీర్ వేర్పాటువాదులతో సర్తాజ్ అజీజ్ భేటీ | Nawaz Sharif's adviser Sartaj Aziz to meet Kashmiri separatists in Delhi, BJP calls it diplomatic blunder | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ వేర్పాటువాదులతో సర్తాజ్ అజీజ్ భేటీ

Nov 11 2013 3:57 AM | Updated on Sep 2 2017 12:30 AM

కాశ్మీర్ వేర్పాటు వాద గ్రూపులతో పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఢిల్లీలో సమావేశం కావడంతో కొత్త వివాదానికి తెరలేచింది.

న్యూఢిల్లీ: కాశ్మీర్ వేర్పాటు వాద గ్రూపులతో పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఢిల్లీలో సమావేశం కావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. ఆదివారం అజీజ్ ఇక్కడి పాక్ హైకమిషన్‌లో హురియత్ కాన్ఫరెన్స్ గ్రూపులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆసియా, యూరప్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి ఉదయం ఇక్కడికి వచ్చిన అజీజ్.. సాయంత్రం హురియత్ నేత సయ్యద్ అలీషా, జేకేఎల్‌ఎఫ్ నేత యాసిన్ మాలిక్, మితవాద అవామీ గ్రూపు నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, దుక్‌తరనీ మిల్లట్ ఫౌండర్ అసియా అండ్రబీతో సమావేశమయ్యారు. అంతకుముందు దీనిని అడ్డుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఇలా భారత భూభాగంలో కాశ్మీర్ వేర్పాటు వాదులతో అజీజ్ సమావేశానికి యూపీఏ ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement