ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ? | Narsayyamma takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

Oct 5 2015 4:45 PM | Updated on Sep 3 2017 10:29 AM

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

మా ఊరుకు ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది.

విజయనగరం : మా ఊరుకు ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది. సోమవారం విజయనగరం జిల్లా ఎ రావివలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు.

అనంతరం గూడెపువలస గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మాట్లాడే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ క్రమంలో నర్సాయమ్మ మాట్లాడుతూ....తాము ఇద్దరం అక్కాచెల్లిళ్లమని... తనకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తామకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని తెలిపారు.

ఆ భూమే తమకు జీవనాధారమన్నారు. ఈ భూమిని కూడా తీసుకుంటే తమకు జీవనోపాధి కోల్పోతామని ఆమె కన్నీటిపర్యంతమైయ్యారు. మాకు ఎయిర్పోర్ట్ వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది.  కావాలంటే ప్రాణాలైన ఇస్తాం కానీ... భూములు మాత్రం ఇవ్వమని నర్సాయమ్మ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement