మోడీ ప్రమాణా స్వీకారానికి 3 వేల మంది అతిథులు | narendra modi swears tomorrow | Sakshi
Sakshi News home page

మోడీ ప్రమాణా స్వీకారానికి 3 వేల మంది అతిథులు

May 25 2014 7:56 PM | Updated on Mar 29 2019 9:24 PM

భారత నూతన ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

ఢిల్లీ: భారత నూతన ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6 గం.లకు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి మూడు వేలమంది అతిథులు హాజరుకానున్నారు. తొలిసారిగా సార్క్ దేశాల అధినేతలు కూడా రేపటి వేడుకల్లో పాల్గొననున్నారు.

దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏడువేల సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement