నేనే... నంబర్ వన్! | Mutt named Peanut is 'World's Ugliest Dog' in competition | Sakshi
Sakshi News home page

నేనే... నంబర్ వన్!

Jun 22 2014 12:39 AM | Updated on Sep 29 2018 4:26 PM

నేనే... నంబర్ వన్! - Sakshi

నేనే... నంబర్ వన్!

నాకు పోటీయే లేదు.. నేనే నంబర్ వన్.. అన్నట్లు చూస్తున్న ఈ శునకం నిజంగానే నంబర్ వన్

నాకు పోటీయే లేదు.. నేనే నంబర్ వన్.. అన్నట్లు చూస్తున్న ఈ శునకం నిజంగానే నంబర్ వన్ . కాకపోతే.. ఇది గెలిచింది ప్రపంచంలోనే అతి అందవికారమైన శునకాల పోటీలో. కుక్కల్లో అతిచిన్నదైన చిహువాహువా జాతి, ఒళ్లంతా బొచ్చుతో బొమ్మలా ఉండే షిట్జూ జాతి శునకాల కలయిక వల్ల పీనట్ అనే ఈ శునకం పుట్టి ఉంటుందని, అందుకే ఇలా ఏ జాతిదో కూడా తెలియకుండా తయారైందని చెబుతున్నారు. చూస్తేనే డోకొచ్చేలా ఉంది కాబట్టే.. శుక్రవారం కాలిఫోర్నియాలోని పెటలుమాలో జరిగిన ‘ప్రపంచంలోనే అతి అందవికారమైన శునకాల పోటీ’లో ఇది ట్రోఫీ గెలుచుకుని ఇలా ఫొటోలకు ఫోజిచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement