ముంబై గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి


గతవారం దేశ వాణిజ్య రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో జర్నలిస్టును గత అర్థరాత్రి ఆసుపత్రి నుంచి డిశార్జి చేసినట్లు ఆ ఆసుప్రతి సీఈఓ, సంచాలకుడు డాక్టర్ తరంగ్ జ్ఞన్చందనీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆమె పూర్తి అరోగ్యంగా ఉందని తమ ఆసుప్రతి వైద్య బృందం నివేదిక అందించింది, ఆ నేపథ్యంలో ఫోటో జర్నలిస్టును ఇంటికి పంపినట్లు తెలిపారు. త్వరగా కొలుకునేందుకు ఆమెకు మెరుగైన చికిత్స అందించినట్లు చెప్పారు. అందులో భాగంగా మెడికల్ కౌన్సిలింగ్ అందించినట్లు పేర్కొన్నారు. మానసికంగా, ఆరోగ్యంగా ఆమె త్వరగా కొలుకోవడానికి తమ ఆసుపత్రి వైద్య బృందం అందించిన సేవలును ఆయన ఈ సందర్బంగా కొనియాడారు. అలాగే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అసాంఘిక శక్తులకు అడ్డా మహాలక్ష్మి ప్రాంతంలోని శక్తి మిల్స్ ప్రాంగణం. విధి నిర్వహాణలో భాగంగా ఫోటో జర్నలిస్టు సహాయకునితో కలసి గత గురువారం సాయంత్రం అక్కడికి చేరుకుంది. ఆ క్రమంలో అక్కడ ఫోటోలు తీసేందుకు ఉపక్రమించింది. అయితే ఆమె ప్రయత్నాన్ని కొందరు యువకులు అడ్డుకున్నారు. అనంతరం ఆ యువకులు ఫోటో జర్నలిస్టుపై దాడికి ఉపక్రమించారు. ఆమె సహాయకుడు వారి దాడిని నిలువరించాడు. దాంతో ఆ యువకులు తీవ్ర ఆగ్రహాంతో ఆమె సహాయకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా అతన్ని కట్టేసి, ఫోటో జర్నలిస్ట్పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ విషయాన్ని ఎక్కడైన బహిర్గతం చేస్తే చంపేస్తామని హెచ్చరించారు.దీంతో ఆ మహిళ జస్లోక్ ఆసుపత్రిలో జాయిన్ అయి జరిగిన సంఘటన వివరాలను వైద్యులకు వివరించింది. దాంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సామూహిక అత్యాచార సంఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిందితుల అరెస్ట్ చేసేందుకు యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను పృద్వీరాజ్ చౌహన్ ఆదేశించారు.దాంతో మహారాష్ట్ర క్రైం బ్రాంచ్, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. నిందితులకు కఠినంగా శిక్షించాలని రాజకీయా పార్టీలు, వివిధ సంఘాలు ముక్త కంఠంతో నినదించిన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన విషయం విదితమే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top