మోటోరోలా నుంచి ‘మాడ్యులర్’ స్మార్ట్‌ఫోన్లు | Motorola reveals ambitious plan to build modular smartphones | Sakshi
Sakshi News home page

మోటోరోలా నుంచి ‘మాడ్యులర్’ స్మార్ట్‌ఫోన్లు

Oct 31 2013 2:24 AM | Updated on Sep 2 2017 12:08 AM

మోటోరోలా నుంచి ‘మాడ్యులర్’ స్మార్ట్‌ఫోన్లు

మోటోరోలా నుంచి ‘మాడ్యులర్’ స్మార్ట్‌ఫోన్లు

మీకు నచ్చినట్లుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే డిజైన్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వస్తోంది.

 న్యూయార్క్: మీకు నచ్చినట్లుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను  మీరే డిజైన్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వస్తోంది. ఈ అవకాశాన్నందించే ప్రాజెక్ట్ అరాకు అమెరికా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా అందిస్తోంది. తమ మొబైల్స్‌లో ఎలాంటి విడిభాగాలుండాలో, తదితర అంశాలను ఎంచుకునే సౌకర్యాన్ని ఈ ప్రాజెక్ట్ అరా కల్పించనున్నది. మోడ్యులర్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి ఉచిత, ఓపెన్ హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేయడం ఈ ప్రాజెక్ట్ అరా లక్ష్యమని ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం, గూగుల్‌లో ఒక భాగమైన మోటోరోలా కంపెనీ పేర్కొంది.
 
 ఈ ప్రాజెక్ట్‌ను మోటోరోలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్  గ్రూప్ పర్యవేక్షిస్తుందని వివరించింది. స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఆండ్రాయిడ్‌లాగే హార్డ్‌వేర్‌కు సంబంధించి కూడా ఒక ఓపెన్ హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేయనున్నామని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ ఎలా ఉండా లో, దేనితో తయారు చేయాలో, ఎలాంటి డిస్‌ప్లే ఉండాలో, కీబోర్డ్ ఎలా ఉండాలో, చివరకు ధర ఎంత ఉండాలో తదితర అంశాల అధారంగా ఈ మాడ్యులర్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తారని వివరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement