సూపర్‌ మోడల్‌ను పెళ్లాడిన టాప్‌ సీఈవో! | Miranda Kerr Marries Snapchat CEO Evan Spiegel | Sakshi
Sakshi News home page

సూపర్‌ మోడల్‌ను పెళ్లాడిన టాప్‌ సీఈవో!

May 28 2017 7:28 PM | Updated on Sep 5 2017 12:13 PM

సూపర్‌ మోడల్‌ను పెళ్లాడిన టాప్‌ సీఈవో!

సూపర్‌ మోడల్‌ను పెళ్లాడిన టాప్‌ సీఈవో!

పెద్ద ఆర్భాటం లేకుండా రహస్యంగా జరిగిన వీరి పెళ్లికి దాపు 40 మంది సన్నిహిత అతిథులు హాజరయ్యారు

సూపర్‌ మోడల్‌ మిరాండ కెర్‌ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. స్నాప్‌చాట్‌ సీఈవో ఎవాన్‌ స్పీగల్‌ను ఆమె పెళ్లాడింది. లాస్‌ ఏంజిల్స్‌లోని ఎవాన్‌ స్పీగల్‌ నివాసంలో వీరి పెళ్లి జరిగింది. పెద్ద ఆర్భాటం లేకుండా రహస్యంగా జరిగిన వీరి పెళ్లికి దాపు 40 మంది సన్నిహిత అతిథులు హాజరయ్యారని పీపుల్స్‌.కామ్‌ తెలిపింది. బయటకు తెలిసేలా పెద్దగా హడావిడి చేయకున్నా అత్యంత విలాసవంతంగా, వివాహం, రిసెప్షన్‌ ఘనంగా జరిగాయని ఈ వేడుకకు హాజరైన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మిరాండ, ఎవాన్‌ 2015 నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. వీరు 2016 జూలై 20న నిశ్చితార్థం చేసుకున్నారు.  స్నాప్‌చాట్‌ యాప్‌లో తమ ఎంగేజ్‌మెంట్‌ ప్రకటన చేసి ఎవాన్‌ ఆశ్చర్యపరిచాడు. మిరాండ కెర్‌ గతంలో ఇంగ్లిష్‌ యాక్టర్‌ ఓర్లాండో బ్లూమ్‌ను పెళ్లాడింది. 2013లో విడాకులు తీసుకున్న వీరికి ఆరేళ్ల కొడుకు ఫ్లిన్‌ ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement