పవన్ రాద్ధాంతం చేయడం తగదు | minister ravela kishore babu reacts on pawan kalyan comments | Sakshi
Sakshi News home page

పవన్ రాద్ధాంతం చేయడం తగదు

Aug 20 2015 4:52 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ రాద్ధాంతం చేయడం తగదు - Sakshi

పవన్ రాద్ధాంతం చేయడం తగదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి పవన్ కల్యాణ్ అడ్డు పడకూడదని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి పవన్ కల్యాణ్ అడ్డు పడకూడదని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు. కేవలం మూడు వేల ఎకరాల కోసం పవన్ రాద్ధాంతం చేయడం తగదని ఆయన మండిపడ్డారు. రాజధాని కోసం, పరిశ్రమల కోసం భూసేకరణ చేయడం కొత్తేమీ కాదని చెప్పారు.

పవన్ కల్యాణ్ సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement