మెదక్ జిల్లా సంగారెడ్డి మునిసిపాలిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
సంగారెడ్డి మునిసిపాలిటీల్లో అవినీతి వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి మునిసిపాలిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకు బాధ్యులైన ఐదుగురు అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎం.జి.గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కష్ణారావు పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న జి.వీరారెడ్డి సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వున్నారు. మిగతా నలుగురిలో సంగారెడ్డి మునిసిపాలిటీ మాజీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ విక్రంసింహారెడ్డి, మాజీ అకౌంటెంట్ కె.లత, మాజీ మేనేజర్ రమేశ్, మాజీ కమిషన్ కేవీవీఆర్ రాజు ఉన్నారు.