రేపిస్టులపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు | meera jasmine comments on rapists | Sakshi
Sakshi News home page

రేపిస్టులపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

Nov 27 2016 11:49 AM | Updated on Jul 28 2018 8:37 PM

రేపిస్టులపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు - Sakshi

రేపిస్టులపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

రేపిస్టులపై ప్రముఖ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కోచి: రేపిస్టులపై ప్రముఖ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై లైంగిక దాడులను చేసేవారికి క్యాస్ట్రేషన్‌ (బీజకోశాలను కత్తిరించి నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని, రేపిస్టుల సైతం ఆ బాధను అనుభవించినప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కేరళలోని పెరుంబవూర్‌లో దళిత మహిళ అత్యాచారానికి గురై.. హత్య చేయబడింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లితోపాటు, నటుడు అనూప్‌తో కలిసి మీరా జాస్మిన్‌ మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతమున్చ చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని పేర్కొంది.

‘మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్న వారికి నొప్పి కలిగించే శిక్షలు ఇవ్వాల్సిన అవసరముంది. అలాంటివారిని ఎదుర్కోవడానికి క్యాస్ట్రేషన్‌ (అంగ విచ్ఛేదన) ఒక్కటే మార్గం’ అని పేర్కొంది. ‘అలాంటి నొప్పి కలిగించే శిక్షలు విధిస్తే.. వారు జీవితంలో మహిళలను తాకడానికి సాహసించరు’ అని తెలిపింది. రేప్‌ బాధితురాళ్లపై మీరా జాస్మిన్‌ నటించిన తాజా సినిమా ‘పాథు కల్పనకల్‌’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విలేకరుల సమావేశం నిర్వహించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement