ఇండియన్ ఫిలిం మేకర్స్కు బంపర్ ఆఫర్ | Mauritius to waive 40% shooting tax for Indian film-makers | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఫిలిం మేకర్స్కు బంపర్ ఆఫర్

Nov 19 2016 12:30 PM | Updated on Sep 4 2017 8:33 PM

ఇండియన్ ఫిలిం మేకర్స్కు బంపర్ ఆఫర్

ఇండియన్ ఫిలిం మేకర్స్కు బంపర్ ఆఫర్

భారతీయ సినీ పరిశ్రమకు మారిషస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో సినిమా షూటింగ్ లకోసం వచ్చే భారతీయ సినీ నిర్మాతలకు 40 శాతం పన్ను వదులుకునేందుకు అంగీకారం కుదిరినట్టు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగతివార్ వెల్లడించారు.

ముంబై:   భారతీయ సినీ పరిశ్రమకు మారిషస్  బంపర్ ఆఫర్ ఇచ్చింది.  తమ దేశంలో సినిమా  షూటింగ్ లకోసం వచ్చే భారతీయ సినీ నిర్మాతలకు  భారీ డిస్కౌంట్ ఆఫర్  ప్రకటించింది.  మారిషస్ ద్వీపంలో  షూటింగ్ నిమిత్తం  వచ్చే ఇండియన్ ఫిలిం మేకర్స్ కి  40 శాతం  పన్ను వదులుకునేందుకు అంగీకారం కుదిరినట్టు  మహారాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగతివార్ వెల్లడించారు.  రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ తో  జరిగిన  ఒక  సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని తెలిపారు. టూరిజం,  లాజిస్టిక్స్, విద్య, చక్కర పరిశ్రమ రంగంలాంటి వివిధఅంశాలతోపాటు సినీపరిశ్రమపై కూడా  చర్చించినట్టు  పీటీఐకి చెప్పారు.  

60 మంది పారిశ్రామికవేత్తలు, 20మంది బాలీవుడ్  ప్రముఖులు  ఈ చర్చల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు.  ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య చర్చలతో పాటు సులభమైన వ్యాపార నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినట్టు తెలిపారు. అలాగే  పర్యాటక అభివృద్ధికి, ముఖ్యంగా అందమైన బీచ్ లను అందంగా తీర్చిదిద్దడంలో మారిషస్ అనుసరిస్తున్న పద్ధతులను  మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి  చెప్పారు.  కాగా   థాయ్లాండ్ లాంటి   ప్రముఖ పర్యాటక దేశాలు భారతీయ సినీ నిర్మాతలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement