ఛోటా భీమ్‌లా ఉంటావు.. నీకు భీముడి పాత్రా? | Malayalis troll KRK for Chota Bheem tweet | Sakshi
Sakshi News home page

ఛోటా భీమ్‌లా ఉంటావు.. నీకు భీముడి పాత్రా?

Apr 20 2017 12:20 PM | Updated on Sep 5 2017 9:16 AM

ఛోటా భీమ్‌లా ఉంటావు.. నీకు భీముడి పాత్రా?

ఛోటా భీమ్‌లా ఉంటావు.. నీకు భీముడి పాత్రా?

సెలబ్రిటీలను నిత్యం దూషిస్తూ.. విమర్శిస్తూ వార్తలు నిలువడం హాబీగా పెట్టుకున్నాడు ఆయన..

సెలబ్రిటీలను నిత్యం దూషిస్తూ.. విమర్శిస్తూ వార్తలు నిలువడం హాబీగా పెట్టుకున్నాడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ అలియాస్‌ కేఆర్‌కే. నిత్యం బాలీవుడ్‌ నటులపై దుమ్మెత్తిపోయే ఆయన తాజాగా మలయాళ నటుడు మోహన్‌లాల్‌పై పడ్డాడు. రూ. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో దుబాయ్‌ బిలియనీర్‌ బీఆర్‌ శెట్టీ తీయనున్న మహాభారతం చిత్రంలో తాను భీముడి పాత్ర పోషిస్తున్నట్టు మోహన్‌లాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా తప్పుబడుతూ కేఆర్కే ట్వీట్‌ చేశాడు. ’మోహన్‌లాల్‌ సర్‌. మీరు ఛోటా భీమ్‌లా కనిపిస్తారు. ఇంకా ఎలా మహాభారతంలోని భీముడి పాత్రను పోషిస్తారు? (నిర్మాత) బీఆర్‌ శెట్టీ డబ్బును మీరెందుకు వృథా చేయాలనకుంటున్నారు’ అంటూ ప్రశ్నించాడు.

కంప్లీట్‌ యాక్టర్‌గా పేరొందిన మోహన్‌లాల్‌ను కించపరుస్తూ కేఆర్కే ఈ వ్యాఖ్య చేయడంతో కేరళ నెటిజన్లు భగ్గుమన్నారు. కేఆర్కేకు తెలియని మలయాళ భాషలో విరుచుకుపడుతూ వేలాది మెసేజ్‌లు ట్విట్టర్‌లో వెల్లువెత్తాయి. తిడుతూ.. తూలనాడుతూ, కించపరుస్తూ, బెదిరిస్తూ వందలాది ట్వీట్ల వరద వెల్లువెత్తింది. దీంతో బిత్తరపోయిన కేఆర్కే మళ్లీ ట్వీట్‌ చేస్తూ.. ‘మలయాళీలు ఎందుకు నన్ను పొద్దటి నుంచి తిడుతున్నారో అర్థం కావడం లేదు. భీముడి ఆయుధమంతా కూడా ఉండని మోహన్‌లాల్‌ భీముడి పాత్ర పోషించాలనుకోవడం సరికాదని నేను అనడం తప్పా’ అంటూ మరోసారి నోరుపారేస్తున్నాడున. మరోవైపు మోహన్‌లాల్‌ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదంటూ కేఆర్కేను నెటిజన్లు చెడామడా వాయిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement