లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్ | Lupin To Buy 21 Branded Drugs From Japan's Shionogi | Sakshi
Sakshi News home page

లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్

Aug 2 2016 2:21 PM | Updated on Sep 4 2017 7:30 AM

లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్

లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్

దేశీయ అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్, 21 బ్రాండెడ్ డ్రగ్స్ పోర్ట్ ఫోలియోను జపాన్స్ షియోనోగి అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ముంబై : దేశీయ అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్, 21 బ్రాండెడ్ డ్రగ్స్ పోర్ట్ ఫోలియోను జపాన్స్ షియోనోగి అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్గా ఉన్న జపాన్లో తన ఉనికిని విస్తరించడానికి 150మిలియన్ డాలర్లకు(రూ.10,010కోట్లకు) ఈ డ్రగ్స్ను లుపిన్ కొనుగోలు చేయనుంది.  నియంత్రణ ఆమోదాలు, ముగింపు షరతులకు లోబడి డిసెంబర్ 3న ఈ డ్రగ్స్ పోర్ట్ ఫోలియో లుపిన్కు ట్రాన్స్ ఫర్ కానుందని కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.

ఈ కొనుగోలు ప్రక్రియను జపనీస్ లుపిన్ డ్రగ్ యూనిట్ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రి కంపెనీ లిమిటెడ్ పూర్తిచేయనుంది. లుపిన్ కొనుగోలు చేసిన ఈ 21 ప్రొడక్ట్లు, షియోనోగికి మార్చితో ముగిసేనాటికి 90 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కేంద్ర నాడీ వ్యవస్థ, ఆంకాలజీ, హృదయ, యాంటీ ఇన్ఫెక్టివ్స్  చికిత్సలకు ఈ ఔషధాలు ఉపయోగపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement