బెంగళూరు వర్సిటీ ప్రాంగణంలోనే న్యాయవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ ఓ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే గత సంవత్సరం అక్టోబర్ నెలలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ ఓ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. నిందితులందరూ తమ జీవితకాలం మొత్తం.. అంటే మరణించే వరకు జైల్లోనే గడపాల్సి ఉంటుందని తీర్పునిచ్చే సందర్భంలో సివిల్, సెషన్స్ జడ్జి సంగణ్నవర్ తెలిపారు. దాంతో పాటు దోషులు ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల జరిమానా విధించారు.
ఈ దారుణ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ఉన్ప్పటికీ, ఏడో నిందితుడు రాజా అప్పటినుంచి పరారీలోనే ఉన్నాడు. ఎనిమిదో నిందితుడు మైనర్ కావడంతో అతడిని ప్రత్యేకంగా బాల నేరస్థుల కోర్టులో విచారిస్తున్నారు. నేపాల్ దేశానికి చెందిన బాధితురాలు మూడో సంవత్సరం న్యాయవిద్య చదువుతోంది. ఆమెపై యూనివర్సిటీ ప్రాంగణంలోనే అత్యాచారం జరిగింది.