లెనోవో.. యోగా ట్యాబ్లెట్‌లు | Lenovo launches Yoga Tablet; aims for higher market share | Sakshi
Sakshi News home page

లెనోవో.. యోగా ట్యాబ్లెట్‌లు

Nov 16 2013 2:44 AM | Updated on May 29 2019 2:59 PM

లెనోవో.. యోగా ట్యాబ్లెట్‌లు - Sakshi

లెనోవో.. యోగా ట్యాబ్లెట్‌లు

పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనోవో కంపెనీ కొత్త యోగ ట్యాబ్లెట్‌లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనోవో కంపెనీ కొత్త యోగ ట్యాబ్లెట్‌లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది.  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ట్యాబ్లెట్‌లను 8, 10 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో కంపెనీ అందిస్తోంది. ట్యాబ్లెట్ 8 ధర రూ.22,999గానూ, టాబ్లెట్ 10 ధర రూ.28,999 గానూ నిర్ణయించామని లెనోవో ఇండియా డెరైక్టర్(కన్సూమర్ బిజినెస్) శైలేంద్ర కత్యాల్ చెప్పారు. ఈ యోగా టాబ్లెట్‌లతో తామందిస్తున్న ట్యాబ్లెట్‌ల సంఖ్య 6కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మైక్రో సిమ్‌ను సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్‌లలో క్వాడ్‌కోర్ 1.2 గిగా హెర్ట్జ్ మీడియా టెక్ కోర్టెక్స్-ఏ7 ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1.6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ట్యాబ్లెట్ 8లో వాయిస్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement