బాలుడిపై టీచర్ అత్యాచారం.. స్కూలుపై దాడి | Lahore school attacked after teacher 'rapes' student | Sakshi
Sakshi News home page

బాలుడిపై టీచర్ అత్యాచారం.. స్కూలుపై దాడి

May 25 2016 3:44 PM | Updated on Jul 12 2019 3:29 PM

బాలుడిపై టీచర్ అత్యాచారం.. స్కూలుపై దాడి - Sakshi

బాలుడిపై టీచర్ అత్యాచారం.. స్కూలుపై దాడి

ఎనిమిదేళ్ల అబ్బాయిపై అతడికి పాఠాలు చెప్పే టీచర్ అత్యాచారం చేయడం, ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి అదృశ్యం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, స్థానికులు ఆ స్కూలు మీద దాడి చేశారు.

ఎనిమిదేళ్ల అబ్బాయిపై అతడికి పాఠాలు చెప్పే టీచర్ అత్యాచారం చేయడం, ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి అదృశ్యం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, స్థానికులు ఆ స్కూలు మీద దాడి చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో జరిగింది. స్థానికుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సదరు టీచర్ అబ్బాయిపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడినుంచి పారిపోయాడు.

పిల్లాడు కూడా కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది. స్థానికులను తోడు తీసుకుని స్కూలుపై దాడి చేశారు. స్కూలు సెక్యూరిటీ గార్డును కూడా కొట్టి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు స్కూలుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రమైందని, చివరకు పోలీసులు ఎలాగోలా వారిని అదుపు చేశారని స్థానికులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement