కేసీఆర్పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి | komatireddy venkat reddy takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి

Aug 13 2015 12:40 PM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి - Sakshi

కేసీఆర్పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఏడాది క్రితం మన ఊరు - మన ప్రణాళిక అంటూ ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు గ్రామజ్యోతి అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా వారికి మాత్రం కేసీఆర్ నష్ట పరిహారం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ తాగునీటి సమస్య తలెత్తిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement