రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోందని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
నిజాం, రజాకారుల పాలనను తలపిస్తోంది: సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి
తిప్పర్తి: రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోందని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తూ నిజాం, రజాకార్ల కాలంలో వలె పాలనను సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం నూతన మండలం మాడ్గులపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. వారంలో ఐదు రోజులు ఫాంహౌస్‌లో ఉండే సీఎం ఏ పాలన కొనసాగిస్తాడని ప్రశ్నించారు.