దసరా నుంచి ఆర్ఎస్ఎస్కు కొత్త డ్రస్ | Khaki trousers on sale, RSS to don new uniform from Vijayadashmi | Sakshi
Sakshi News home page

దసరా నుంచి ఆర్ఎస్ఎస్కు కొత్త డ్రస్

Aug 30 2016 9:57 AM | Updated on Sep 4 2017 11:35 AM

దసరా నుంచి ఆర్ఎస్ఎస్కు కొత్త డ్రస్

దసరా నుంచి ఆర్ఎస్ఎస్కు కొత్త డ్రస్

ఖాకీ నిక్కర్లకు స్వస్తి చెప్పి, కొత్త డ్రస్ కోడ్ను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్ణయించింది.

ఆర్ఎస్ఎస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది..తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు. సంఘ్ ఏర్పడిన 90 ఏళ్ల నుంచి కొనసాగుతున్న డ్రస్ కోడ్ ఇదే. కానీ ప్రస్తుతం ఖాకీ నిక్కర్లకు స్వస్తి చెప్పి, కొత్త డ్రస్ కోడ్ను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్ణయించింది. విజయదశమి పురస్కరించుకుని అక్టోబర్ 11 నుంచి కొత్త డ్రస్ను అమల్లోకి తేవాలని ముహుర్తం ఖరారు చేసింది. ఖాకీ నిక్కర్లను స్థానంలో ముదురు గోధుమ వర్ణపు ప్యాంటులను ప్రవేశపెడుతున్నట్టు ఆర్ఎస్ఎస్ తెలిపింది. ఇప్పటికే నాగపూర్ ప్రాంతాల్లో అధికారికంగా కొత్త డ్రస్ విక్రయాలను చేపట్టింది. జంట ప్యాంటులను రూ.250లకు స్వయం సేవక్స్కు ఆర్ఎస్ఎస్ విక్రయించనుంది. అదనంగా రెండు అంగుళాలు పెంచడానికి స్వయంసేవక్స్ మరో 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
 
అయితే ఈ ప్యాంటులను ఆర్ఎస్ఎస్సే స్వతహాగా కుట్టించి, స్వయంసేవక్లకు పంపిణీ చేయనుందట., మార్చిలోనే ఖాకీ నిక్కర్ల స్థానంలో కొత్త డ్రస్ను అమల్లోకి   తేనున్నట్టు ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ అత్యున్నత నిర్ణయ సంస్థ అఖిల్ భారతీయ ప్రతినిధి సభ, వార్షిక మీటింగ్లో ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖాకీ నిక్కర్లు ధరిస్తే తమపై కామెంట్లు చేస్తున్నారని యువత వాపోతున్న వాదనతో నిక్కర్లకు స్వస్తి చెప్పాలని ఆర్ఎస్ఎస్ భావించింది. యువకులు పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతుండటంతో వారిని ఆకట్టుకునేలా నిక్కరు స్థానంలో ప్యాంటులను ప్రవేశపెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement