'ఆ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలే' | KCR schemes only Canvassing of arrangements, says Kishan reddy | Sakshi
Sakshi News home page

'ఆ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలే'

Jul 27 2015 1:15 PM | Updated on Aug 15 2018 9:27 PM

'ఆ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలే' - Sakshi

'ఆ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలే'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ప్రకటించిన పథకాలెన్ని?, వాటి నిధులెన్ని? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.

అనుమతుల్లేని ప్రాజెక్టులపై ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో? చెప్పాలన్నారు.  స్వార్థ ప్రయోజనాల కోసమే జీహెచ్ఎమ్సీలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement