కమెడియన్ కపిల్ శర్మకు కోపమొచ్చింది | Kapil Sharma asks PM Narendra Modi, ‘ye hai aapke acche din’, Devendra Fadnavis takes action | Sakshi
Sakshi News home page

కమెడియన్ కపిల్ శర్మకు కోపమొచ్చింది

Sep 9 2016 10:43 AM | Updated on Apr 3 2019 7:53 PM

కమెడియన్ కపిల్ శర్మకు కోపమొచ్చింది - Sakshi

కమెడియన్ కపిల్ శర్మకు కోపమొచ్చింది

తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ కపిల్ శర్మ కోపమొచ్చింది.

తన హాస్యంతో  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ కపిల్ శర్మ కోపమొచ్చింది. అచ్చే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామంటూ సాధారణ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ప్రధాని నరేంద్రమోదీకి "అచ్చే దిన్" ఎక్కడుందంటూ ప్రశ్నలు సంధించారు. తన ఆఫీసు స్థాపనకు బలవంతపూర్వకంగా లంచంగా రూ.5లక్షలు చెల్లించాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల నుంచి 15 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్న తను, ఇప్పటికీ ఆఫీసు స్థాపనకు రూ.5 లక్షల లంచం బీఎంసీ ఆఫీసుకు చెల్లించాల్సిందని ఆరోపించారు. ఈ ట్వీట్కు జతగా మరో ట్వీట్ చేశారు. ఇదేనా తమ అచ్చే దిన్ అనే ట్వీట్ను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు.
 
సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లోకి మొదటిసారిగా వచ్చిన ఈ కమెడియన్ యాక్టర్, తన కోపాన్ని ఈ ట్వీట్ల ద్వారా వ్యక్తపరిచారు. కపిల్ ట్వీట్లపై వెంటనే స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాంటూ ఎంసీ, బీఎంసీలకు ఆదేశాలు జారీచేశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేదని పేర్కొన్నారు. పాపులర్ కామెడీ షోను ఆయన నిర్వర్తిస్తున్నారు. క్రికెటర్లు, బాలీవుడ్ వంటి చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటుటారు. తన షోకు ప్రధాని మోదీ కూడా పాల్గొన్నాలని కోరుకుంటున్నాని గతంలోనే తన కోరికను వెల్లబుచ్చిన సంగతి తెలిసిందే. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement