కనిమొళి, రాజాలపై ఈడీ చార్జిషీట్లు! | Kanimozhi, Raja likely be chargesheeted soon by ED | Sakshi
Sakshi News home page

కనిమొళి, రాజాలపై ఈడీ చార్జిషీట్లు!

Jan 13 2014 4:57 PM | Updated on Sep 2 2017 2:36 AM

కనిమొళి, రాజాలపై ఈడీ చార్జిషీట్లు!

కనిమొళి, రాజాలపై ఈడీ చార్జిషీట్లు!

డీఎంకే నాయకురాలు కనిమొళి, టెలికంశాఖ మాజీ మంత్రి ఎ.రాజాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలోనే చార్జిషీట్లు నమోదు చేయనుంది.

డీఎంకే నాయకురాలు కనిమొళి, టెలికంశాఖ మాజీ మంత్రి ఎ.రాజాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలోనే చార్జిషీట్లు నమోదు చేయనుంది. 2జీ స్పెక్ట్రం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ చార్జిషీటు దాఖలు కానుంది. అటార్నీ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఈడీ పంపిన చార్జిషీటును న్యాయమంత్రిత్వ శాఖకు పంపింది. దీనికి దేశంలోని అత్యున్నత న్యాయాధికారి గులాం ఇ. వాహనవతి ఆమోదముద్ర వేయాలని ఈడీ భావించింది. ఆ మేరకు ఆయన ఇప్పటికే దీన్ని ఆమోదించి, న్యాయశాఖకు పంపారు. అందువల్ల ఈడీ త్వరలోనే నియమ నిబంధనల ప్రకారం ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ కూడా ఈ చార్జిషీటుపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి దాదాపు రూ. 200 కోట్ల మొత్తాన్ని డీఎంకే కుటుంబం తమ కలైంగర్ టీవీలోకి మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. అందుకు తమవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ అంటోంది. ఈ విషయంలో గతంలో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఈడీ ఆధారంగా తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement