అనూహ్యంగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన నటి కారు! | Kangana Ranaut escapes a road accident in US | Sakshi
Sakshi News home page

అనూహ్యంగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన నటి కారు!

Oct 15 2016 5:12 PM | Updated on Aug 30 2018 4:10 PM

అనూహ్యంగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన నటి కారు! - Sakshi

అనూహ్యంగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన నటి కారు!

బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ 'సిమ్రాన్‌' సినిమా షూటింగ్‌ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉంది.

బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ 'సిమ్రాన్‌' సినిమా షూటింగ్‌ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉంది. హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ ప్రమాదం నుంచి కంగనా అనూహ్యరీతిలో బయటపడిందట. భారీ రోడ్డుప్రమాదం నుంచి ఆమె చిన్నచిన్న గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

కంగనా సన్నిహిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. జార్జియా శివారులో షూటింగ్‌ ముగించుకొని అట్లాంటా హోటల్‌కు కంగనా కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతూ.. హైవే 381పై ట్రాఫిక్‌ ఉన్నా.. దానిని లెక్కచేయకుండా వేగంగా ముందుకుపోనిచ్చాడు. ఇంతలో అతడు తీవ్రంగా దగ్గుతూ.. అస్వస్థతకు గురయ్యాడు. వేగంగా వాహనం సాగుతుండగానే అతడు స్టీరింగ్‌పై తలవాల్చి.. స్పృహ తప్పిన స్థితిలోకి వెళ్లాడు. అతని పక్కన కూర్చున్న కంగనా బాడీగార్డు వెంటనే స్పందించి.. స్టిరింగ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

అయినా హైవే లైన్స్‌ను దాటి.. సమీపంలో ఉన్న ఐరన్‌ ఫెన్సింగ్‌ను కారు వేగంగా ఢీకొంది. అయితే, ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా తప్పించుకున్నారు. కంగనాతోపాటు కారులో ఉన్న షూటింగ్‌ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కంగనాకు నుదురుపై, చేతులపై అక్కడక్కడా చిన్నగా చీరుకుపోయిన గాయాలయ్యాయి. అయినా, షూటింగ్‌ను ఆపడం ఇష్టంలేని కంగనా మరునాడు షూటింగ్‌లో పాల్గొన్నదని చిత్రయూనిట్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement