వేశ్యాగృహంలో మీడియాకు చిక్కిన పాప్ స్టార్! | Justin Bieber spotted leaving a brothel in Rio de Janeiro | Sakshi
Sakshi News home page

వేశ్యాగృహంలో మీడియాకు చిక్కిన పాప్ స్టార్!

Published Mon, Nov 4 2013 4:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

వేశ్యాగృహంలో మీడియాకు చిక్కిన పాప్ స్టార్!

సినీ నటులు, పాప్ స్టార్స్ చాటుమాటుగా తమ ప్రేయసిలతో కనిపించడం సాధారణమే. అయితే అంతర్జాతీయంగా గొప్ప పేరు, ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ ఓ వేశ్య గృహంలో కనిపించడం సంచలనం రేపింది. తాజాగా టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో ఓ వేశ్యాగృహంలో కనిపించడం అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న జస్టిన్ బీబర్ వేశ్య గృహంలో  మీడియా కంటపడటం అనేక విమర్శలకు దారి తీసింది. 
 
పందొమ్మిదేళ్ల బీబర్, తన స్నేహితుడితో కలిసి మూడు గంటలపాటు రియో డి జెనిరోలోని సెంటారోస్ బ్రోతల్ (వేశ్యా వాటిక) గడిపారని న్యూయార్క్ పోస్ట్ ఆరో పేజిలో కథనాన్ని వెల్లడించింది. వేశ్యగృహం నుంచి వెళ్లే సమయంలో అతని బాడీ గార్డ్స్ బెడ్ షీట్ ను బీబర్ ముఖంపై కప్పి తీసుకువెళ్లినట్టు కథనంలో పేర్కోంది. 
 
అంతేకాకుండా వేశ్యలను కూడా తన హోటల్ రూంకు తీసుకువెళ్లారని ఫోటోగ్రాఫర్లు కూడా ధృవీకరించారు. ఈ వ్యవహరంతో ఆగ్రహించిన బ్రెజిల్ ఫ్యాన్స్..  ఓ కార్యక్రమంలో ఓ వేదికపైన ఉన్న బీబర్ ను వాటర్ బాటిల్ తో కొట్టారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement