బైక్కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు | Journalist in Uttar Pradesh Thrashed, Dragged Behind Motorcycle | Sakshi
Sakshi News home page

కొట్టి బైక్కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు

Jun 15 2015 9:30 AM | Updated on Sep 3 2017 3:47 AM

బైక్కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు

బైక్కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు

దేశంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువవుతున్నాయి. తమ అరాచకాలను బయటపెడుతున్న విలేకరులకు రక్షణ లేకుండా పోతోంది.

పిలిభిత్: దేశంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువవుతున్నాయి. తమ అరాచకాలను బయటపెడుతున్న విలేకరులకు రక్షణ లేకుండా పోతోంది. డబ్బు అధికార బలం అండచూసుకుని రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్లో పిలిభిత్ జిల్లాలో ఓ జర్నలిస్టును పిలిచిమరీ దారుణంగా కొట్టారు. బైక్కు తాడుతో కట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లారు. అచ్చం సినిమాల్లో రౌడీల మాదిరిగా వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదర్ ఖాన్ అనే విలేకరి సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆనంద్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు.

ఓ దొంగతనానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతడిని రక్షించేందుకు రావాలని ఫోన్ లో కోరాడు. దీంతో అతడు ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో నలుగురుకు పైగా అతడిపై దాడి చేసి కారులోంచి బయటకు లాగి.. బైక్ కట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలో ఇదే జిల్లాలో జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టుకు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement