ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి మృతి!
Feb 3 2014 10:29 AM | Updated on Sep 2 2017 3:18 AM
రాంచీ: ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంచీ సమీపంలోఎని మండార్ టౌన్ ప్రాంతానికి చెందిన సుజిత్ ముండాను ఉపాధ్యాయుడు అర్సద్ అన్సారీ విచక్షణరహితంగా కొట్టడంతో మరణించాడని విద్యార్థి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థి రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలోని మండార్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకే మరణించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ రిపోర్డ్ కోసం చూస్తున్నామని.. ఆతర్వాత మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement


