ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు తీవ్రవాదులు హతం | JCO, two militants killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు తీవ్రవాదులు హతం

Apr 8 2014 10:37 AM | Updated on Aug 25 2018 6:13 PM

కుప్వారా జిల్లా క్లార్పొరా ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు ఇద్దరు తీవ్రవాదులు మరణించారు.

కుప్వారా జిల్లా క్లార్పొరా ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. మరో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు భద్రత ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అటు భద్రత దళాలు, ఇటు తీవ్రవాదుల మధ్య గత రాత్రి నుంచి హోరాహోరి కాల్పులు జరిగాయని చెప్పారు. గాయపడిన పోలీసులు కుప్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement