‘కావేరి వల్లే జయకు జైలు!’ | jayalalalitha supporters raises cauvery water issues | Sakshi
Sakshi News home page

‘కావేరి వల్లే జయకు జైలు!’

Oct 12 2014 12:51 AM | Updated on Sep 2 2017 2:41 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడం వెనుక కావేరీ జలాల వివాదం దాగి ఉందంటూ ఆ పార్టీ శ్రేణులు నేరుగా పోస్టర్లనే వేసేశారు.

సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడం వెనుక కావేరీ జలాల వివాదం దాగి ఉందంటూ ఆ పార్టీ శ్రేణులు నేరుగా పోస్టర్లనే వేసేశారు. ‘కావేరీ తల్లీ.. ప్రతీకారం తీర్చుకుంది కర్ణాటక కోర్టు. తల్లిలేక తమిళనాడు తల్లడిల్లిపోతోంది, విడుదల చేయ్...అమ్మను విడుదల చేయ్’ అంటూ అన్నాడీఎంకే టీనగర్ శాఖ నేతలు నగరంలో వాల్ పోస్టర్లు వేశారు.

 

ఇప్పటికే మంత్రి వలర్మతి, టీనగర్ ఎమ్మెల్యే కలైరాజన్‌లతో తదితర ముఖ్యనేతలు పలు వివాదాస్పద పోస్టర్లు వేసి అగ్నికి ఆజ్యం పోయగా... తాజాగా వెలిసిన పోస్టరు నేరుగా కర్ణాటక న్యాయస్థానంపై నిందలు మోపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement