సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం | Jaya case: DMK hails SC verdict rejecting SPP appointment | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం

Apr 27 2015 2:29 PM | Updated on Sep 2 2018 5:18 PM

సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం - Sakshi

సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం

జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు.

చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. జయలలిత కేసును వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించడాన్ని తప్పుబట్టడంతో పాటు.. ఇప్పటివరకు ఈ కేసులో జరిగిన వాదోపవాదాలు చాలని, ఇక తీర్పును వెల్లడించవచ్చని కర్ణాటక హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలియజేయడమే కాకుండా గతంలో ఈ విషయంపై ఉన్న స్టేను ఎత్తివేసింది.

డీఎంకే పార్టీకి చెందిన నేతే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ విజయం సాధించిన నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధిని మీడియా ప్రశ్నించింది. ఈ కేసు ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన ఇప్పుడే తాము ఎన్నికల గణాంకాలు వేసుకోవడంలేదని, అయితే, ఇది మాత్రం తమ పార్టీకి పెద్ద విజయమే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement