ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదే: జైవర్థన్ సింగ్ | Jaiwardhan Singh (Digvijaya Singh's son) casts his vote in Raghogar | Sakshi
Sakshi News home page

ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదే: జైవర్థన్ సింగ్

Nov 25 2013 12:02 PM | Updated on Oct 8 2018 3:19 PM

ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదే: జైవర్థన్ సింగ్ - Sakshi

ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదే: జైవర్థన్ సింగ్

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌కు 130 సీట్ల వరరకూ వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం రఘోగఢ్‌లో జైవర్ధన్‌ సింగ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే సంతోషం వేస్తోందన్న జైవర్థన్‌... తన గెలుపుపై మాత్రం ముక్తసరిగా మాట్లాడారు.  అంతా ప్రజల చేతుల్లో ఉందని విశ్లేషించారు.

కాగా మధ్య ప్రదేశ్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈరోజు ఉదయం పది గంటల వరకూ 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ 143, కాంగ్రెస్ 71 స్థానాలు గెలుచుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement