జాగ్వార్ కొత్త రేంజ్ రోవర్ లాంచ్ | Jaguar Land Rover launches new Range Rover Evoque priced up to Rs 67.9 lakh | Sakshi
Sakshi News home page

జాగ్వార్ కొత్త రేంజ్ రోవర్ లాంచ్

Dec 20 2016 8:09 PM | Updated on Jul 6 2019 3:20 PM

ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్‌ సొంతమైన లగ్జూరియస్ కార్ల తయారీ సంస్థ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) 2107 మోడల్ రేంజ్ రోవర్‌ ఎవోక్‌ పేరుతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్‌ సొంతమైన లగ్జూరియస్  కార్ల తయారీ సంస్థ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)  మరో సరికొత్త  రేంజ్ రోవర్ కారును లాంచ్ చేసింది.    2107  మోడల్  రేంజ్  రోవర్‌  ఎవోక్‌ పేరుతో  దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది.  దీని ధర రూ.49.10 లక్షలు నుంచి రూ.67.9లక్షల (దిల్లీ ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది.

'విడుదలైన నాటి నుంచే రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సరికొత్త హంగులతో 2017 మోడల్‌ను  మార్కెట్ లోకి తీసుకు రావడం సంతోషంతగా ఉందని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు రోహిత్‌ సూరి ఓ ప్రకటనలో తెలిపారు. 017 రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ ఇంజినీయమ్‌ 2 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ తో  , ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 

భారతదేశంలో మొట్టమొదటిగా లాంచ్ కానున్న ల్యాండ్ రోవర్ పోర్ట్ఫోలియోలో  డిస్కవరీ స్పోర్ట్  రూ 47,59 లక్షల ప్రారంభ ధరగా , రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ రూ 1.18 కోట్లు, ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్  రూ.2.13 కోట్లలో విక్రయించనున్నట్టు టాటా మెటార్స్ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement