'టీడీపీలో దొంగలా దూరాడు' | Jagadish reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'టీడీపీలో దొంగలా దూరాడు'

Apr 29 2015 1:44 PM | Updated on Aug 11 2018 4:28 PM

'టీడీపీలో దొంగలా దూరాడు' - Sakshi

'టీడీపీలో దొంగలా దూరాడు'

ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెడితే డ్వాక్రా మహిళలు చీపుర్లతో కొడతారని సీఎం చంద్రబాబు భయపడుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెడితే డ్వాక్రా మహిళలు చీపుర్లతో కొడతారని సీఎం చంద్రబాబు భయపడుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్రెడ్డి ఎద్దేవ చేశారు. ఆ భయంతోనే మహానాడును హైదరాబాద్లో నిర్వహించాలని ఆయన నిర్ణయించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో జగదీశ్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... తెలంగాణలో మిగులు బడ్జెట్కు చంద్రబాబే కారణమైతే... ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మిగులు బడ్జెట్ సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తన దగ్గర కేసీఆర్ పని చేశాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా స్పందించారు. 

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ఆ పార్టీలోనే కొనసాగారని... కానీ చంద్రబాబు మాత్రం టీడీపీలోకి మధ్యలో దొంగలా దూరాడని అన్నారు. 1983లో చంద్రబాబు ఏ పార్టీ నుంచి పోటీ చేసింది అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా  జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. చెట్టు కింద కుర్చొని అయిన పరిపాలన చేస్తానని చెప్పిన చంద్రబాబు... ఆంధ్ర బంకర్లలో ఉండి కూడా ఉండి పాలన చేయలేరని చెప్పారు. చంద్రబాబుది లీకుల బతుకని  జగదీశ్రెడ్డి ఆరోపించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement