ఐసిస్ 'కిల్ లిస్టు' లో భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు! | Islamic State militants release 'kill list', target 4000 people including 285 Indians | Sakshi
Sakshi News home page

ఐసిస్ 'కిల్ లిస్టు' లో భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు!

Jun 27 2016 11:44 AM | Updated on Sep 4 2017 3:33 AM

ఐసిస్ 'కిల్ లిస్టు' లో భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు!

ఐసిస్ 'కిల్ లిస్టు' లో భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు!

285 మంది భారతీయులు సహా 4వేల మందిని చంపుతామంటూ ఐఎస్ఐఎస్ ఓ ‘కిల్ లిస్టు’ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తన సైబర్ యాక్టివిటీస్ సంస్థ ఖలీఫత్ సైబర్ ఆర్మీ(సీసీఏ) ద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 4,000 మందిని చంపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 'కిల్ లిస్టు' పేరిట వారి పేర్ల జాబితాను విడుదల చేసింది. సగానికి పైగా అమెరికన్ల పేర్లతో కూడిన ఈ జాబితాలో యూకే, ఫ్రాన్స్, కెనడాలకు చెందిన పౌరులతో పాటు 285 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి.

వీరందరినీ వెంటనే అంతమొందించాలంటూ ఐఎస్ఐఎస్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి ఫాలోవర్స్ కు పిలుపునిచ్చింది. ఐఎస్ఐఎస్ విడుదల చేసిన జాబితాలో చంపాల్సినవారి చిరునామాలతో పాటు ఈ-మెయిల్ ఐడీలు కూడా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ ప్రకటించిన 285 మంది భారతీయుల పేర్లలో దేశానికి ఐసిస్ నుంచి రక్షణ కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పేర్లు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement