ఆ 84 మందిని చంపింది మేమే | Islamic State claims responsibility for Nice attack | Sakshi
Sakshi News home page

ఆ 84 మందిని చంపింది మేమే

Jul 16 2016 2:58 PM | Updated on Sep 4 2017 5:01 AM

ఆ 84 మందిని చంపింది మేమే

ఆ 84 మందిని చంపింది మేమే

ఫ్రాన్స్లోని నీస్ నగరంలో దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) శనివారం ప్రకటించింది.

పారిస్: ఫ్రాన్స్లోని నీస్ నగరంలో దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) శనివారం ప్రకటించింది. నీస్లో జనాలపైకి ట్రక్ నడిపిన డ్రైవర్ మహమద్ లహొయెజ్ బోహ్లెల్ తమ సైనికుడని పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

బాస్టిల్ డే సందర్భంగా నీస్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జనసమూహంపైకి ట్రక్ నడిపి కిరాతకచర్యకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement