సీమాంధ్రలో సమ్మె మరింత కాలం కొనసాగుతూ.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖకు భారత ప్రభుత్వం నిర్దేశించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి.
సీమాంధ్రలో సమ్మె మరింత కాలం కొనసాగుతూ.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖకు భారత ప్రభుత్వం నిర్దేశించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించేట్లయితే.. ఎదురుకాగల ఏదైనా రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గవర్నర్‌ను మార్చాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ స్థానంలో కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్‌ను తెస్తారని, నరసింహన్‌ను తమిళనాడు గవర్నర్‌గా బదిలీచేసి.. అక్కడ గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్యను కర్ణాటక గవర్నర్‌గా పంపిస్తారని చెప్తున్నారు. ఈ ముగ్గురు గవర్నర్ల పరస్పర బదిలీకి కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం, ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆమోదించినట్లు సమాచారం.