విమానం అదృశ్యం వెనుక ఉగ్రవాదుల పాత్రపై ఆరా | Investigate the role of the terrorist behind the disappearance of the aircraft | Sakshi
Sakshi News home page

విమానం అదృశ్యం వెనుక ఉగ్రవాదుల పాత్రపై ఆరా

Mar 9 2014 9:08 PM | Updated on Sep 2 2017 4:31 AM

మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదశ్యమైన బోయింగ్ విమాన ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా మలేసియా ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది.

కౌలాలంపూర్/బీజింగ్: మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదశ్యమైన బోయింగ్ విమాన ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల పాత్రపై ఆరా తీయాలని  అధికారులను మలేసియా ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. 239 ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఆ విమానంలో ఇద్దరు దొంగిలించిన(ఒకటి ఇటలీవాసిది, రెండోది ఆస్ట్రియావాసిది) పాస్ పోర్టులతో ఎక్కారని తేలిన నేపథ్యంలో.. ఉగ్రవాద చర్యపై ప్రభుత్వం దష్టి సారించింది. కాగా అదశ్యమైన విమానం కోసం పలు దేశాలు చేపట్టిన గాలింపు రెండో రోజు కూడా ఎలాంటి ఆశావహ ఫలితాలనివ్వలేదు. బహుశా ఆ మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం వెనక్కు వచ్చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

చైనా, బీజింగ్, వియత్నాం దేశాలతోపాటు అమెరికా 22 విమానాలు, 40 ఓడలను రంగంలోకి దిగి ఇప్పటికే గల్లంతైన విమానం కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. విమాన ఆచూకీ కోసం కనుగొనే క్రమంలో ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement