నక్సల్స్ దాడులపై మూడు రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు | Intelligence bureau IB issues Naxal attack alert for Jharkhand, Chhattisgarh, Bihar | Sakshi
Sakshi News home page

నక్సల్స్ దాడులపై మూడు రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు

Aug 14 2013 10:08 PM | Updated on Oct 9 2018 2:47 PM

స్వాతంత్య్ర వేడుకలను బ్లాక్ డేగా పరిగణిస్తూ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలో నక్సల్స్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

స్వాతంత్య్ర వేడుకలను బ్లాక్ డేగా పరిగణిస్తూ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలో నక్సల్స్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్, గిరీధ్ జిల్లాల్లో రైల్వే లైన్లను నక్సల్స్ ధ్వంసం చేయొచ్చని... ఛత్తీస్‌గఢ్‌లోని దర్బా ఘాటీలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడొచ్చని పేర్కొంది. అలాగే బీహార్‌లోని ఔరంగాబాద్, లఖిసరాయ్, జముయ్ జిల్లాల్లో భారీ దాడుల కోసం నక్సల్స్ ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు ఐబీ తెలిపింది.
 
 ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అరెస్టు
 రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో కుమా కొర్రమ్ (30) అనే మావోయిస్టును పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం అతను ఇచ్చిన సమాచారం ప్రకారం రెంగగోడి గుట్టల్లో దాచిన ఐదు తుపాకులు, రెండు కేజీల టిఫిన్‌బాక్స్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement