'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..! | Sakshi
Sakshi News home page

'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!

Published Wed, Jun 15 2016 11:20 PM

'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!

అత్తింటి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు
బాధితురాలు ప్రముఖ వ్యాపారవేత్త
త్రైలోక్య నాథ మిశ్రా కోడలు

 
 భువనేశ్వర్: అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా పోలీసులను ఆశ్రయించారు. మంగళ వారం రాత్రి తన ప్రాణానికి ముప్పు ఉందని బెదిరించారని స్థానిక బర్‌గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అపహరిస్తామని అత్త, మామ బెదిరించారని పేర్కొన్నారు. పెళ్లయిన కొత్తలో హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో వైవాహిక జీవితం తొలి దశలోనే తనపట్ల భర్త అమానుషంగా వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు.
 
 పెద్దింటి కోడలిగా సమాజంలో గౌరవం కాపాడుకుంటు పుట్టింటికి అగౌరవం కలగకుండా జాగ్రత్తపడేందుకు చాల కాలం ఓపికతో వ్యవహరించడంతో రోజు రోజుకు వేధింపులు తీవ్రంగా మారాయి తప్ప పరిస్థితులు కుదుటపడనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.  దీంతో తనను హత్య చేస్తామని  అత్తింటి వారు బెదిరించారని  పేర్కొన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకి వివాహం జరిగింది.
 
 భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి మిశ్రా, మామ త్రైలోక్యనాథ మిశ్రా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినట్లు బహిరంగపరిచారు. ఈ మేరకు స్థానిక మహిళా ఠాణాలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితం శూన్యం కావడంతో ఈసారి స్థానిక బర్‌గడ్ ఠాణాలో మరో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసుల నిర్వీర్యతపట్ల నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన బుధ వారం మీడియాకు తెలియజేశారు. మహిళా ఠాణా పోలీసుల నిర్వీర్యత ఖాతరు చేయకుండా నగర పోలీసు కమిషనరేటు ఆధ్వర్యంలో కౌన్సిలింగుకు అభ్యర్థించి చేసిన ప్రయత్నాలు కూడ ఫలించనట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement