ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై! | Indo-Canadian Woman, Lover Found Guilty Of Murdering His Wife | Sakshi
Sakshi News home page

ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై!

Jul 21 2016 9:40 AM | Updated on Aug 27 2019 4:33 PM

ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై! - Sakshi

ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై!

తెలుగు సినిమా ట్విస్టులకు ఏమాత్రం తీసిపోని ట్రయాంగ్యులర్ లవ్ మర్డర్ కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరిని కెనడా కోర్టు దోషులుగా తేల్చింది.

తెలుగు సినిమా ట్విస్టులకు ఏమాత్రం తీసిపోని ట్రయాంగ్యులర్ లవ్ మర్డర్ కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరిని కెనడా కోర్టు దోషులుగా తేల్చింది. గుర్ప్రీత్ రోనాల్డ్ (37), ఆమె ప్రియుడు భూపిందర్ పాల్ గిల్ (41) కలిసి గిల్ భార్యను చంపినట్లు నిర్ధారించింది. 2014 జనవరిలో జగ్తార్ గిల్ (43) తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. దానిపై పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపారు. అనంతరం ఒటావాలోని సుపీరియర్ కోర్టులో 9 వారాల పాటు విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఆమెను ప్రేయసీ ప్రియులిద్దరూ కలిసి చంపినట్లు తేల్చారు.

తమ 17వ పెళ్లిరోజునే జగ్తార్ గిల్ను దారుణంగా పొడిచి చంపారు. హత్యకు ఒకరోజు ముందే ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె భర్త భూపీందర్పాల్ గిల్, అతడి ప్రేయసి గుర్ప్రీత్ రోనాల్డ్ ఇద్దూ ఒటావాలోని ఓసీ ట్రాన్స్పోలో బస్సు డ్రైవర్లు. పక్కపక్క ఇళ‍్లలో ఉండేవారు. వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. దాంతో తామిద్దరం కలిసి ఉండాలంటే భార్య అడ్డు తొలగించుకోవాలని భావించి, ఆమెను హతమార్చినట్లు రుజువైంది. కాగా గిల్ దంపతులకు ముగ్గురు పిల్లలుండగా, రోనాల్డ్కు ఇద్దరు కూతుళ్లున్నారు. గిల్తో తనకు లైంగిక సంబంధం ఉందని అంగీకరించిన గుర్ప్రీత్.. తాను అతడితో సంతృప్తి చెందలేదని, అందుకే అదే సమయంలో మరో డ్రైవర్తో కూడా సంబంధం పెట్టుకున్నానని పోలీసుల విచారనలో తెలిపింది. అయితే.. ఆమెకు కేవలం ఏడ్చేటప్పుడు ముఖం ఆనించడానికి ఒక భుజం మాత్రమే అవసరమైందని, ఆ మద్దతు కోసమే స్నేహం ఏర్పరుచుకుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement