breaking news
indo canadian woman
-
బ్రిటిష్ కొలంబియా డిప్యూటీ ప్రీమియర్‌గా తొలి ఇండో–కెనడియన్
భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది. ఈ పదవి చేపట్టిన తొలి ఇండో–కెనడియన్‌గా చరిత్ర సృష్టించింది. కెనడాలోని లేత్బ్రిడ్జ్లో పుట్టిన నికీ శర్మ బ్రిటీష్ కొలంబియాలోని స్పార్వుడ్లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వచ్చారు. తండ్రి పాల్ చిన్న వ్యాపారవేత్త. తల్లి రోజ్ సైంటిస్ట్. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెర్టా ఫ్యాకల్టీ ఆఫ్ లా’ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న నికీ శర్మ ఆ తరువాత లా ఫర్మ్ ‘డోనోవన్ అండ్ కంపెనీ’లో చేరింది.పర్యావరణ సంస్థ ‘స్టాండ్ ఎర్త్’ కోసం క్యాంపెయినర్‌గా పనిచేసింది. 2014లో వాంకూవర్ సిటీ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఓటమి మాట ఎలా ఉన్నా ఆ తరువాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టింది. అటార్నీ జనరల్‌గా జాతివివక్ష నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఎంతో కృషి చేసింది. గత పదిహేనేళ్లుగా ఈస్ట్ వాంకూవర్‌లో నివసిస్తున్న శర్మ ఇద్దరు పిల్లల తల్లి. ఎప్పుడూ చురుగ్గా ఉండే శర్మను పాదరసం’ అని పిలుస్తుంటారు. (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై!
తెలుగు సినిమా ట్విస్టులకు ఏమాత్రం తీసిపోని ట్రయాంగ్యులర్ లవ్ మర్డర్ కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరిని కెనడా కోర్టు దోషులుగా తేల్చింది. గుర్ప్రీత్ రోనాల్డ్ (37), ఆమె ప్రియుడు భూపిందర్ పాల్ గిల్ (41) కలిసి గిల్ భార్యను చంపినట్లు నిర్ధారించింది. 2014 జనవరిలో జగ్తార్ గిల్ (43) తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. దానిపై పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపారు. అనంతరం ఒటావాలోని సుపీరియర్ కోర్టులో 9 వారాల పాటు విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఆమెను ప్రేయసీ ప్రియులిద్దరూ కలిసి చంపినట్లు తేల్చారు. తమ 17వ పెళ్లిరోజునే జగ్తార్ గిల్‌ను దారుణంగా పొడిచి చంపారు. హత్యకు ఒకరోజు ముందే ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె భర్త భూపీందర్పాల్ గిల్, అతడి ప్రేయసి గుర్ప్రీత్ రోనాల్డ్ ఇద్దూ ఒటావాలోని ఓసీ ట్రాన్స్పోలో బస్సు డ్రైవర్లు. పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. దాంతో తామిద్దరం కలిసి ఉండాలంటే భార్య అడ్డు తొలగించుకోవాలని భావించి, ఆమెను హతమార్చినట్లు రుజువైంది. కాగా గిల్ దంపతులకు ముగ్గురు పిల్లలుండగా, రోనాల్డ్‌కు ఇద్దరు కూతుళ్లున్నారు. గిల్‌తో తనకు లైంగిక సంబంధం ఉందని అంగీకరించిన గుర్ప్రీత్.. తాను అతడితో సంతృప్తి చెందలేదని, అందుకే అదే సమయంలో మరో డ్రైవర్‌తో కూడా సంబంధం పెట్టుకున్నానని పోలీసుల విచారనలో తెలిపింది. అయితే.. ఆమెకు కేవలం ఏడ్చేటప్పుడు ముఖం ఆనించడానికి ఒక భుజం మాత్రమే అవసరమైందని, ఆ మద్దతు కోసమే స్నేహం ఏర్పరుచుకుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.